ఉద్యమిద్దాం రండి!
● ఫిబ్రవరి 5న ఫీజుపోరును విజయవంతం చేద్దాం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి పిలుపు
తిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉ ద్యమిద్దామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షు లు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి పద్మాతిపురంలోని తన నివాసంలో శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నోటికొచ్చినట్లుగా అబద్దాలు చెప్పి అందలమెక్కిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటికే కరెంట్ చార్జీల పెంపుపై ఉద్యమించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విషయంపై ఫిబ్రవరి 5వ తేదీన ‘ఫీజుపోరు’ పేరుతో కలెక్టరేట్ల వద్ద ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్యనందించాలన్న లక్ష్యంతో దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఫీజురీయింబర్స్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆ పథకాన్ని కొనసాగించిన గొప్ప నాయకుడు జగనన్న అని కొనియాడారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఫిబ్రవరి 5న ఫీజుపోరుపై ప్రతిఒక్కరూ ఉద్యమిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment