No Headline
విత్తనాలు కూడా ఇవ్వలేదు
నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేద్దామని నార్ల మళ్లు పోశా. ఈలోగా పెంగల్ తుపాను వచ్చింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు అధికంగా పొలాలపై ప్రవహించింది. 15 రోజులు నీరు తగ్గకుండా ఉండి పోయింది. దీంతో నాలుగు ఎకరాలకు పోసుకున్న నారు మళ్లు మురిగి పోయా యి. సుమారు రూ.30 వేల వరకు నష్టం వాటిల్లింది. మళ్లీ నారు పోసుకునేందుకు ప్రభుత్వం కనీసం విత్తనాలు కూడా అందించలేదు. – పామంజి నాగరాజు, ఆరూరు, చిట్టమూరు మండలం
రూ.22 వేలు నీటిపాలు
రెండు ఎకరాల్లో విత్తిన వేరుశనగ విత్తనాలు తుపాను ప్రభావంతో కొట్టుకుపోయాయి. దుక్కి దున్నడానికి, ఎరువులకు, విత్తనాలు విత్తడానికి మా కష్టం పోను రూ.22 వేలకు పైగా ఖర్చు అయింది. పంట నష్టాన్ని చూడడానికి అధికారులు రాకపోగా.. వివరాలను కూడా తీసు కోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్షాలకు పంట దెబ్బతిన్న నెల లోపే పరిహారాన్ని అందుకున్నాము. కూటమి ప్రభు త్వం వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించింది. – గురుస్వామినాయుడు,
అరణ్యంకండ్రిగ, నారాయణవనం మండలం
Comments
Please login to add a commentAdd a comment