యువతా మేలుకో..ఓటు నమోదు చేసుకో!
తిరుపతి సిటీ: అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి పద్మావతి మహిళా వర్సిటీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు. 18 ఏళ్లు నిండిన యువత విధిగా ఓటు హక్కును పొందాలని సూచించారు. అనంతరం వీసీ ప్రొఫెసర్ ఉమ మాట్లాడారు. ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. సీనియర్ సిటిజన్స్‌ను సత్కరించారు. ఈఆర్‌ఓలకు, ఏఈఆర్‌ఓలకు, బీఎల్‌ఓలకు పత్రాలను అందజేశారు. వివిధ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రం, మెమెంటోలను అందజేశారు. డీఆర్‌ఓ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment