ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
నాగలాపురం: ప్రియుడితో కలసి తన భర్తను హత్య చేసిన ఘటన శనివారం పిచ్చాటూరు మండలం, కీళ్లపూడి పంచాయతీ, గజసింగరాజపురం గ్రామంలో చోటు చేసుకుంది. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటేష్ వివరాలను నమోదు చేసుకున్నారు. మృతుడు ఆంటోని (33) భార్య సుగంధి విజయపురం మండలం, ఇరుగువాయికు చెందిన అరుల్‌రాజుతో వివాహేతర సంబంధానికి ఒడిగట్టింది. అయితే భర్త అడ్డొస్తున్నాడన్న కారణంతో పథకం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ప్రియుడు అరుల్‌రాజుతో కలసి నిద్రపోతున్న భర్త మెడకు తాడుకట్టి బిగించి హత్య చేసింది. ప్రాథమిక విచారణలో సైతం ఇది హత్యగా తేలింది. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. క్షణికావేశంతో తీసుకున్న ఈ నిర్ణయంతో పిల్లలు రోడ్డున పడ్డారని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment