తిరుమల: కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురంధరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహించనున్నారు. మొదటి రోజైన జనవరి 28న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు, పురంధర సాహిత్య గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, మధ్యాహ్నం సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరిరోజు జనవరి 30న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
28న ‘హరిదాస రంజని’
జనవరి 28న తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘హరిదాస రంజని’ గోష్టిగానం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment