పంగనామం!
పకడ్బందీగా గణతంత్ర ఏర్పాట్లు
గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. పోలీస్ పరేడ్ మైదానంలో రిహార్సల్స్ నిర్వహించారు.
పరిహారం..
ఆదివారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2025
సత్యవేడు నియోజకవర్గం, సంతవేలూరులో కొట్టుకుపోయిన వరి నారుమళ్లు(ఫైల్)
కూటమి నేతలు రైతులను పూర్తిగా విస్మరించారు. ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే అన్నదాతను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. గత ఆరు నెలలుగా ప్రకృతి ప్రకోపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న అన్నదాతను ఆదుకోవాల్సింది పోయి నష్టాలు ఊబిలోకి నెట్టేస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. పంట నష్టపరిహారానికీ పంగనామాలు పెడుతున్నారని పలువురు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికై నా కళ్లు తెరిచి పరిహారాన్ని సత్వరం విడుదల చేయాలని కర్షకులు కోరుతున్నారు.
అక్టోబర్‌లో వచ్చిన వర్షాలతో
వేనాడులో మొలకెత్తిన వరి
నాలుగు ఎకరాల్లో పంట పాచిపోయింది
పెంగల్ తుపాన్‌తో నాలుగు ఎకరాల్లో వరిపంట మునిగి పోయింది. ఐదు రోజులు గా నీటిలో నానడంతో పంట మొత్తం పాచిపోయింది. మళ్లీ పెట్టుబడి పెట్టాలంటే అప్పులు చేయక తప్పలేదు. ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా నన్చ డం విడ్డూరంగా ఉంది. – వెంకటేశ్వర్లు, రైతు,
సూళ్లూరు గ్రామం, సూళ్లూరుపేట మండలం
కొందరికే పరిహారం
పెంగ తుపాన్‌తో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ప్రధానంగా వరి పంట దెబ్బతిన్నది. అయితే వ్యవసాయశాఖ అధికారులు అందిరికీ న్యాయం చేయకుండా కొందరికి మాత్రమే పరిహారం ఇచ్చేలా లెక్కలు రాసుకున్నారు. నేను సాగు చేసిన 2.8 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. రూ.50వేల వరకు నష్టం వచ్చింది.
–భాస్కర్, పీవీపురం గ్రామం, సత్యవేడు మండలం
ఆరు నెలలుగా ప్రకృతి ప్రకోపం
● పంట నష్టం అపారం
● పరిహారం శూన్యం
● ఆపసోపాలు పడుతున్న 20 వేల మంది రైతులు
● పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
● కన్నెత్తి చూడని కూటమి నేతలు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రకృతి పగబట్టింది. వరుస వర్షాలతో రైతులను అతలాకుతలం చేసింది. గత ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్‌లో భారీ వర్షాలతో ముంచెత్తింది. ఒక్క పెంగల్ తుపాన్‌తోనే జిల్లా వ్యాప్తంగా 5,600 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. అయితే పాలకులు మేజర్‌గా దెబ్బతిన్న పంట వివరాలే నమోదు చేసి నివేదికలు పంపడం విమర్శలకు తావిస్తోంది.
గత ఆగస్ట్‌లో 550 హెక్టార్లలో నష్టం
గత ఏడాది ఆగస్ట్‌లో కురిసిన భారీ వర్షాలకు రేణిగుంట, దొరవారిసత్రం, వడమాలపేట, తడ మండలాల్లో 550 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. అయితే వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ నాలుగు మండలాల్లో 74 మంది రైతులకు సంబంధించి 54.24 హెక్టార్లలో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నివేదిక ఇచ్చారు. ఆ ప్రకారం హెక్టార్‌కు రూ.25 వేలు చొప్పున రూ.13.56 లక్షలు చెల్లించారు.
డిసెంబర్‌లో భారీ నష్టం
గత ఏడాది డిసెంబర్‌లో పెంగల్ తుపాన్ బీభత్సం సృష్టించింది. జిల్లాలోని 34 మండలాలకు గాను 25 మండలాల్లో 5,600 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ అధికారులు 12 మండలాల్లో మాత్రమే పంట నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. ఈ లెక్కన 658 మంది రైతులకు చెందిన 455.37 హెక్టార్లలో నష్టం జరిగిందని, ఒక్కో హెక్టారుకు రూ.17వేల చొప్పున మొత్తం రూ.77.41 లక్షలు చెల్లించాల్సి ఉందని అంటున్నారు. అలాగే 32.73 హెక్టార్లలో ఇసుక మేటలు వేయగా ఒక్కో హెక్టారుకు రూ.18 వేల చొప్పున రూ.5.89 లక్షలు 75 మంది రైతులకు చెల్లించాలని లెక్కలు గట్టారు. వరిపంట కోత దశలో 20.60 హెక్టార్లలో దెబ్బతినగా ఒక్కో హెక్టారుకు రూ.47 వేలు చొప్పున రూ.9.68 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. దీని కోసం 65 మంది రైతులు ఎదురు చూస్తున్నారు.
– IIలో
– IIలో
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment