మాడుగలకు తిరుపతితో విడదీయరాని అనుబంధం
తిరుపతి సిటీ: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మాడు గల నాగఫణి శర్మకు తిరుపతితో విడదీయరాని బంధం ఉంది. తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో ఆయన డిగ్రీ విద్యాభ్యాసం చేశారు. ఆర్‌ఎస్ గార్డన్‌లో ప్రాంతంలో ఉంటూ వారాలబ్బాయిగా జీవనం సాగిస్తూ డిగ్రీ పట్టా పొందారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంగా పిలవబడే ప్రస్తుత జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సాహిత్య విభాగంలో పరిశోధక విద్యార్థిగా ప్రొఫెసర్ సన్నిదానం సుదర్శన శర్మ పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1990–92 మధ్య కాలంలో టీటీడీ ధర్మప్రచార పరిషత్ అదనపు కార్యదర్శిగా సేవలందించారు.
వారికి జామీను ఇవ్వొద్దు!
తిరుపతి మంగళం: ఎరచ్రందనం అక్రమ రవాణా కేసుల్లో తెలియని ముద్దాయిలకు జామీను ఇచ్చి ఇబ్బందులు పడొద్దని ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిని కోర్టు తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. 2017లో తమిళనాడుకు చెందిన ముద్దాయికి జామీను ఇచ్చిన ఇద్దరికి శనివారం కోర్టు రూ.25 వేలు చొప్పున జరిమానా విధించింది. క్రైమ్ నం31/2017 కేసులో తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన ఏ.వెల్లికన్నన్ అనే ముద్దాయికి తిరుపతి జిల్లా ఎరవ్రారిపాళ్యంకు చెందిన ఎం.గోబ్రీ నాయక్ (47), ఎం.శ్రీరాములు నాయక్ (67)కు జామీను ఇచ్చారు. అయితే వారు కోర్టు వాయిదాలకు హాజరు కావడం లేదు. దీంతో ఆర్‌ఎస్‌ఎస్ ఏడీజె కోర్టు జామీను ఇచ్చిన ఇద్దరికీ రూ.25 వేలు చొప్పున జరిమానా విధించింది. ఎరచ్రందనం కేసుల్లో తెలియని ముద్దాయిలకు జామీను ఇచ్చే ముందు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
గణతంత్ర వేడుకలకు
సర్వం సిద్ధం
తిరుపతి కల్చరల్: గణతంత్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. టీటీడీ పరిపాలనా భవనంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీ పరిపాలన భవ నం వెనుకనున్న పరేడ్ మైదానంలో టీటీడీ ఈఓ జే.శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. విధి నిర్వహణలో ప్రతిభ చాటిన ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
రసాయన రహిత ఆహారమే లక్ష్యం
తిరుపతి సిటీ: ప్రజలకు రసాయన రహిత ఆహారం అందించడమే తన అంతిమ లక్ష్యమ ని సేంద్రియ విప్లవ పితామహుడు, పద్మశ్రీ సుభాష్ పాలేకర్ పేర్కొన్నారు. శనివారం తిరుపతి ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియం వేదికగా వ్యవసాయం వైపు యువతను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ‘సుభాష్ పాలేకర్, వ్యవసాయం(క్రిషి)’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడు తూ వ్యవసాయరంగంలో యువతకు బంగారు భవిష్యత్ ఉందన్నారు. భూ మాతను యువత ఇష్టంగా ప్రేమించి సంరక్షించుకోవాలని సూచించారు. కెమికల్స్ రహిత ఆహారాన్ని అందించే లక్ష్యంతో తుదిశ్వాస వరకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి వివేక్ మాట్లాడుతూ యువత 30 ఏళ్లలోపే లక్ష్యాన్ని నిర్ధారించుకుని ఛేదించాలన్నారు. సివిల్స్, వ్యవసాయరంగంపై యువత దృష్టి సారించాలని చెప్పారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులు విద్యతో పాటు వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్వీయూ వీసీ సీహె చ్ అప్పారావు మాట్లాడుతూ వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాల ని పిలుపునిచ్చారు. సదస్సు ఆర్గనైజర్ డాక్టర్ పాకనాటి హరికృష్ణ, డీన్ ఎన్‌సీ.రాయుడు, ప్రిన్సిపల్ కేటీ.రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment