వసతిగృహాల్లో మెరుగైన సౌకర్యాలు
తిరుపతి అర్బన్: ఎస్సీ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో ముందుంటానని ఆ విభాగం జిల్లా అధికారి విక్రమకుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న చెన్నయ్య చిత్తూరు జిల్లాకు బదిలీ అవగా..విజయవాడ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న విక్రమకుమార్‌రెడ్డి తిరుపతి జిల్లాకు విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లోని తమ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను కలిశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ఎస్సీ వసతి గృహాల్లోని సమస్యలను పూర్తిగా తెలుసుకుంటామని, అనంతరం వాటికి పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. ప్రధానంగా విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించాలని వెల్లడించారు.
బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం
అంగన్‌వాడీ పాఠశాలల్లో బాలింతలు, గర్భిణులకు క్రమంతప్పకుండా పౌష్టికాహారాన్ని అందిస్తామని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వసంతాబాయ్ పేర్కొన్నారు. జిల్లాలో పీడీగా పనిచేస్తున్న జయలక్ష్మి పదోన్నతిపై నాలుగు రోజుల క్రితం ఒంగోలు ఆర్జేడీగా బదిలీపై వెళ్లారు. ఈ క్రమంలో కడపలో పనిచేస్తున్న వసంతాబాయ్ తిరుపతికి బదిలీపై వచ్చారు. ఆ మేరకు ఆమె శుక్రవారం కలెక్టరేట్‌లోని తమ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తర్వాత ఆమె మాట్లాడుతూ అన్ని అంగన్‌వాడీ స్కూల్స్ నుంచి క్రమం తప్పకుండా బాలింతలు, గర్భవతులకు పౌష్టికఆహారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment