28 నుంచి సదర్వ ఈవెంట్–2025
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28 నుంచి రెండు రోజులు సదర్వ ఈవెంట్–2025 నిర్వహించనున్నట్టు వీసీ ప్రొఫెసర్ ఉమ తెలిపారు. ఆమె శుక్రవారం ఈవెంట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సదర్వ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో విద్యార్థులకు పోస్టర్, పేపర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్‌పో, వర్క్ షాప్‌తో పాటు టెక్నికల్ గేమ్స్ నిర్వహిస్తామన్నారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొననున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎన్ రజిని, ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ మల్లికార్జున, అధ్యాపకులు బి.మాధవి, శ్రీనివాస పద్మజ, డాక్టర్ రామకృష్ణ, స్టూడెంట్ కన్వీనర్ ఇందుశ్రీ, స్టూడెంట్ కో–కన్వీనర్ భాను ప్రశాంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment