మహాశివరాత్రి ఉత్సవాలపై నేడు సమీక్ష
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెలలో జరగననున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నట్టు పేర్కొన్నారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తే రూ.5వేలు
తిరుపతి మంగళం : రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించే ప్రక్రియలో సహాయపడే వారికి ప్రోత్సాహకంగా రూ.5వేలు నగదు బహుమతిగా ఇవ్వడంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తామని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్విమ్స్ ఆస్పత్రి సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్షతగాత్రుని తరలించే అంశంలో సహాయపడిన వ్యక్తికి పోలీస్ నుంచి న్యాయస్థానం వరకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుందని మోటార్ వాహనాల తనిఖీ అధికారి అతికానాజ్ తెలిపారు. అంతకుముందు పాత మెటర్నిటీ ఆస్పత్రి నుంచి సిమ్స్ హాస్పిటల్ వరకు జిల్లా ప్రధాన వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ సిబ్బందితో ప్రచార ర్యాలీ నిర్వహించారు.
డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏర్పాట్ల పరిశీలన
తిరుపతి సిటీ: తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఈనెల 3వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సమావేశం కోసం ఎస్వీయూ సెనేట్ హాల్‌ను జేసి, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకు ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల ప్రక్రియ పూర్తి వీడియో రికార్డింగ్ చేయాలని సూచించారు. సంబంధిత పార్టీ ప్రతినిధులు విప్ జారీ ప్రతులను సంయుక్త కలెక్టర్‌కి ఫిబ్రవరి రెండో తేదీ ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల్లోపు అందజేయాలని చెప్పారు. 3వ తేదీ 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో సంబంధిత కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఎస్వీయూలోని సెనేట్ హాల్‌కు హాజరు కావాలన్నా రు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అమరయ్య, డీడీ బాలకొండయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment