రిజిస్ట్రేషన్ల సందడి
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సందడి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌పై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 10–20 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించడంతో 31వ తేదీ శుక్రవారం క్రయవిక్రయదారులు బారులు తీరారు. రాత్రి 8 గంటలవుతున్నా కార్యాలయంలో ఏ మాత్రం ఖాళీ లేకుండా నిండిపోయారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొందరు లాబీయింగ్ చేస్తుండగా మరికొందరు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అధిక మొత్తంలో కమీషన్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment