మెరుగైన సౌకర్యాలే లక్ష్యం
తిరుపతి అర్బన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన తిరుపతి రైల్వే స్టేషన్‌కు పడమర వైపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కల్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. ఇటీవల కొందరు అధికార పార్టీ నేతలు ఆ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు జోక్యం చేసుకుని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన రూ.315 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. వచ్చే ఏప్రిల్ నాటికి దక్షిణం వైపు పనులు పూర్తికావాలన్నారు. ఉత్తరం వైపు నిర్మాణాలు అదే నెలలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేసినప్పటికీ ప్రయాణికులకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదో చెప్పాలని ప్రశ్నించారు. అనంతరం తిరుపతి నగరంలోని రశ్రీదేవి కాంప్లెక్స్ సమీప ప్రాంతంలో నివాసం ఉంటున్న కృష్ణయ్య అనే వైద్యులు తిరుపతి రైల్వే స్టేషన్‌కు రెండు వీల్‌చైర్స్‌తోపాటు స్ట్రెచర్‌ను విరాళంగా జీఎం చేతుల మీదుగా అందించారు. వారితోపాటు గుంతకల్లు డివిజన్ రైల్వే అధికారి చంద్రశేఖర్ గుప్తా, తిరుపతి స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, స్టేషన్ మాస్టర్ చిన్నరెడ్డెప్ప, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
తిరుచానూరు
రైల్వే స్టేషన్ పరిశీలన
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట) : సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శుక్రవారం తిరుచానూరు రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. అనంతరం రేణిగుంట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయనకు రైల్వే లైసెన్స్ కూలీ పోర్టర్లు స్వాగతం పలికారు. సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా, స్టేషన్ మేనేజర్ శేషగిరినాథరెడ్డి, గుంతకల్లు, సికింద్రాబాద్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జనరల్ మేనేజర్ ఇన్‌స్పెక్షన్ స్పెషల్ ట్రైన్‌లో గుంతకల్లుకు బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment