రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
చంద్రగిరి: కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు గాయాలపాలైన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి తొండవాడ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులోని బనశంకరికి చెందిన వసుధ తన కుటుంబ సభ్యులతో కలసి కారులో తిరుమలకు బయల్దేరారు. తొండవాడ వద్ద వస్తున్న క్రమంలో కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవరు మనుతో పాటు వసుధకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు.
తెల్లరాయి నిల్వలపై దాడులు
సైదాపురం: మండలంలోని ఓరుపల్లి సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన తెల్లరాయిని శుక్రవారం జిల్లా మైనింగ్ అధిరులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 120 టన్నులకు పైగా మూడు లారీల ఖనిజాన్ని స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వివరాలు.. పొదలకూరు మండలంలోని డేగపూడి వద్ద ఉన్న మైన్‌లో దొంగతనంగా తెల్లరాయిని తీసుకుని ఓరుపల్లి వద్ద నిల్వ ఉంచారంటూ జోగిపల్లి గ్రామానికి చెందిన శివకృష్ణ జనవరి 27న పోలీసులకు, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మైనింగ్ ఆర్‌ఐ స్వాతి తన సిబ్బందితో కలిసి ఓరుపల్లి గ్రామంలో నిల్వ ఉన్న ప్రాంతానికి చేరుకుని తెల్లరాయిని స్వాధీనం చేసుకున్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 3 కంపార్ట్‌మెంట్లు నిండాయి. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.14 కోట్లు సమర్పించారు. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
టీటీడీ దాతల పేరుతో..
తిరుమల: టీటీడీ దాతల పేరుతో నకిలీ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను విక్రయించి మోసగించిన దళారీపై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. ఆ వివరాలను శుక్రవారం పోలీసులు వెల్లడించారు. తిరుమల వన్‌టౌన్ ఎస్‌ఐ రమేష్‌బాబు కథనం.. హైదరాబాద్‌కు చెందిన ఎం.ఉపేందర్ కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకునేందుకు సహకరించాలని హైదరాబాద్‌కు చెందిన నళినీకాంత్‌ను సంప్రదించా డు. అతను తనకు తెలిసిన సతీష్ అనే దళారీని వారికి పరిచయం చేశాడు. సదరు సతీష్ ముగ్గురు భక్తులకు గత నెల 20వ తేదీకి టీటీడీ రూ.10లక్షల దాతల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్‌ను ఇప్పిస్తానని అందుకు రూ.2,100 అవుతుందని తెలిపాడు. దీంతో భక్తుడు నగదును ఫోన్ పే ద్వారా పంపపాడు. అనంతరం దళారీ దాతలకు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ అని తెలిపి.. వారికి దర్శన టికెట్‌ను పంపాడు. ఆ టికెట్‌తో జనవరి 29న భక్తుడు వైకుంఠం క్యూకాంప్లెక్స్–1లో దర్శనానికి వెళ్లాడు. ఆ టికెట్‌ను స్కానింగ్ చేయగా నకిలీదిగా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment