నేడు సీనియర్ బాలికల హాకీ జిల్లా జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్రీడా మైదానంలో ఆదివారం ఉదయం 7.30 గంటలకు సీనియర్ బాలికల హాకీ జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ మేరకు జిల్లా హాకీ సంఘం కార్యదర్శి బీ.ఆదిత్య, కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్‌కృష్ణ, కోచ్ అశోక్‌రెడ్డి ఓ సంయుక్త ప్రకటనలో విడుదల చేశారు. ఈ పోటీలకు 01–01–1996 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్టు ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరులో నిర్వహించనున్న 14వ రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారిణీలు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 77028 65721, 70131 77413 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.
ఏనుగుల దాడులు
భాకరాపేట : అటవీ సరిహద్దు పంట పొలాలపై ఏనుగులు గుంపు స్వైర విహారం చేసింది. శనివారం తెల్లవారు జామున ఏనుగులు గుంపు ఎర్రావారిపాళెం మండలం, కొటకాడపల్లె పంచాయతీ, అయ్యగారిపల్లె గ్రామ అటవీ సరిహద్దు పొలాల్లోకి వచ్చి వరి పైరును తొక్కి ధ్వంసం చేసింది. ఏనుగుల ఘీకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. దీంతో రైతులు అటు వైపు వెళ్లడానికి సాహసం చేయలేక పోయారు. వారం క్రితం చంద్రగిరి మండలం సీఎం ఇంటి ముందు ఉన్న పంట పొలాల్లో ఏనుగులు గుంపు తిష్టవేసిన విషయం తెల్సిందే. వాటిని తరమడానికి వెళ్లిన ఉప సర్పంచ్, టీడీపీ నాయకుడు మృతిచెందాడు. అయినా సంబంధిత అధికారులు స్పందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment