నిధులు రాబట్టడంలో విఫలం
ప్రస్తుత బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. కూటమి ఎంపీల బలంతో కేంద్ర ప్ర భుత్వం నడుస్తోందని గొప్పలు చెప్పుకోవడంతోనే సరిపోయింది. బీహార్ రాష్ట్రానికి కేటాయించిన మేర కూడా రాష్ట్రానికి నిధులు సాధించ లేక పోయింది. ఏపీకి ఒరిగిందేమీ లేదు. – ఎం.గురుమూర్తి, ఎంపీ, తిరుపతి
రైతులకు భరోసా ఏదీ?
రైతులకు తూతూమంత్రంగానే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కనీసం పెట్టుబడులు, మద్దత్తు ధరపైనా కచ్చితమైన ప్రకటన లేదు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయరంగానికి ప్రాముఖ్యత అంటూ అంకెల గారడీని తలపించేలా బడ్జెట్ ఉంది. గత బడ్జెట్‌లోనూ ఇలాంటి మాయమాటలే చెప్పారు. ఈ ఏడాది రైతులకు ఒరిగిందేమీ లేదు. – కే.రమణమ్మ,
వ్యవసాయశాఖ విశ్రాంత ఉద్యోగి, తిరుపతి
●
Comments
Please login to add a commentAdd a comment