ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించండి
తిరుపతి ఎడ్యుకేషన్ :జిల్లాలో ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ జనరల్ ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్‌ఐఓ జీవీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో బుధవారం జిల్లాలోని అన్ని యాజమాన్య కళాశాలల సైన్స్ అధ్యాపకులతో ప్రాక్టికల్స్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు స్పెల్‌లో ప్రాక్టికల్స్ జరుగుతాయని, మొదటి స్పెల్ ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు ఒకేషనల్ విద్యార్థులకు, చివరి రెండు స్పెల్స్‌ను 10 నుంచి 19వ తేదీ వరకు జనరల్ విద్యార్థులకు 124 పరీక్ష కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్స్‌కు సంబంధించి 91 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించే పరీక్షకు జనరల్ విద్యార్థులు 23,793 మంది విడతల వారీగా హాజరవుతారని, అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సైన్స్ ఎగ్జామినర్లు ఆయా సెషన్లకు సంబంధించి అప్పటికప్పుడే మూల్యాంకనం చేసి, విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయా లని సూచించారు. పరీక్షలకు సంబంధించి ఈ ఏడాది జిల్లా కోడ్‌ను 19గా మార్చారని, దీనిని గుర్తుంచుకుని జిల్లా కోడ్‌ను 19గా నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో సీఎస్‌లుగా ప్రభుత్వ లెక్చరర్లు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్స్‌లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పరీక్షల ప్రత్యేకాధికారి రఘుపతి, డీఈసీ సభ్యులు గోపాల్‌రెడ్డి, వి.రవి, సైన్స్ అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment