జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు వెలంపాడు విద్యార్థులు
రేణిగుంట: మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు శ్రీకాళహస్తి మండలం వెలంపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు ముని రేణుక తెలిపారు. గత నెల 10,11 తేదీల్లో పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ రగ్బీ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు కె.సుబ్రమణ్యం(పదో తరగతి), కె.దివ్య(తొమ్మిదో తరగతి) ప్రతిభ చూపారన్నారు. దీంతో వారు జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నట్లు చెప్పారు. పీడీ ప్రసాద్, హరికృష్ణ, అమరనాధ్ పిల్లలను అభినందించారు.
17 మందికి జరిమానా
తిరుపతి లీగల్: మద్యం తాగి తిరుపతిలో వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతున్న కేసుల్లో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ గ్రంధి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పినట్టు కోర్టు సూపరిండెంట్ ఎన్వీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ట్రాఫిక్ డీఎస్పీల ఆదేశాల మేరకు నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు కోర్టు కానిస్టేబుల్ గిరిబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment