![పేదల వైద్యసేవలపై నిర్లక్ష్యం వద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05stvd34-300071_mr-1738784002-0.jpg.webp?itok=tflvrePY)
పేదల వైద్యసేవలపై నిర్లక్ష్యం వద్దు
– డీఎం అండ్ హెచ్‌ఓ బాలకృష్ణ నాయక్
వరదయ్యపాళెం: పేదలకు వై ద్యసేవలు అందించడంలో ని ర్లక్ష్యం చేయవద్దని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అ ధికారి బాలకృష్ణ నాయక్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వరదయ్యపాళెం మండలంలోని చిన్న పాండూరు పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత ప్రభుత్వంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించి, అన్ని వసతులతో చక్కగా నిర్మించారని సంతృప్తి వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తితో పేద ప్రజలకు వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యాధికారులు ఆస్పత్రిలో అటెండర్ల కొరత ఉందని, దాన్ని తీర్చాలని, ఈ ప్రాంతంలో రోజువారీ 300కు పైగా ఓపీలు నమోదవుతున్న నేపథ్యంలో మందుల కేటాయింపు కొంచెం ఎక్కువగా చేయాలని కోరారు. దీనిపై డీఎం అండ్ హెచ్‌ఓ స్పందిస్తూ అదనపు మందుల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. అటెండర్ల సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శాంతాకుమారి, జిల్లా లెప్రసీ అధికారి శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ పద్మావతి, పీహెచ్‌సీ వైద్యాధికారులు అనిత, లావణ్య ఉన్నారు.
ఐజర్‌లో నేటినుంచి తిరునాల్
రేణిగుంట: ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని ఐజర్‌లో గురువా రం నుంచి 4 రోజుల పాటు తిరునాల్ పేరుతో కార్యక్రమం జరగనుంది. ఇందుకు ఐజర్ ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు మేళవించిన ఈ ఉత్సవంలో అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొంటారు.
చీటింగ్ కేసులో బ్యాంకు ఉద్యోగికి జైలు
తిరుపతి లీగల్: బ్యాంకు డిపాజిట్ సొమ్మును తన సొంతానికి వాడుకుని మో సం చేసిన కేసులో తిరుమలలోని ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్గా విధులు నిర్వహించిన కే. శ్రీధర్ కు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2008 సంవత్సరంలో టీటీడీ అతిథి గృహాలకు చెందిన సొమ్మును టీటీడీ సిబ్బంది తిరుమలలోని ఆంధ్ర బ్యాంకులో డిపాజిట్ చేసేవారు. ఆ బ్యాంకులో క్యాషియర్గా విధులు నిర్వహిస్తున్న నిందితుడు కే శ్రీధర్ అధికారుల సంతకాలను తానే చేసి, సుమారు రూ.4,91,960 తన సొంతానికి వాడుకున్నాడు. దీనిపై బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఎంఎస్ రామ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీధర్‌ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి శ్రీధర్ కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ జయశేఖర్ వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment