సిండికేట్ మద్యంపై సలార్ సీల్
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత శ్రీకాళహస్తిలో మద్యం దుకాణాలు ఎవరికీ దక్కుండా గంపగుత్తగా టీడీపీ నేతలే దక్కించుకున్నారు. దుకాణాలను సిండికేట్ చేసి, షేర్ల రూపంలో పదిపైసల వాట నుంచి అమ్మేస్తున్నారు. బెల్టుషాపులో అమ్మే ప్రతి మద్యం బాటిల్‌పై సలార్ సినిమా తరహాలో ఓ సీల్ వేస్తున్నారు. సిండికేట్ షాపుల్లో ఆ సీల్ ఉంటేనే అమ్మాలని సీల్ లేని మద్యం అమ్మితే పోలీసులకు తెలిపేలా ఓ వ్యవస్థను రూపొందించుకున్నారు. బయట నుంచి మద్యం తెచ్చి అమ్మే అవకాశం లేకుండా స్థానిక సిండికేట్ నుంచే మాత్రమే మద్యం అమ్మాలని సలార్ సీల్ రూపొందించారు. అయితే మూడు నెలలుగా మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగడంతో సంక్రాంతి, జనవరి ఫస్టు రావడంతో సిండికేట్‌కు లాభాల పంట పండింది. ఈ సలార్ సీల్‌తో బెల్టు షాపుల్లో సైతం ఈ మద్యం అమ్ముతున్నారు. ఎకై ్సజ్ అధికారులు ఈ సలార్ సీల్ చూసి భయపడిపోతున్నారు. ఎవరైనా అధికారులు అటుపోతే సీల్ చూపి వారిని వెనక్కి పంపిస్తున్నారు. దీనిపై శ్రీకాళహస్తి పట్టణంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాళహస్తి చరిత్రలో ఈ విధంగా మద్యం షాపుల్లో చేయడం ఇదే మొదటి సారి. గోవా వంటి కేంద్రపాలిట ప్రాంతంలో మాత్రమే కూల్‌డ్రింక్ షాపులో మద్యం దొరికేది. ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం శ్రీకాళహస్తిలో ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతోంది. అధికారులు మాత్రం ఏం పట్టించుకోనన్నట్లు వ్యహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment