ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న కారు
● మహిళ మృతి ● నలుగురికి తీవ్ర గాయాలు ● దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన
రేషన్ బియ్యం
అక్రమ రవాణా వాహనంగా గుర్తింపు
పాడైపోయి రోడ్డు పక్కన ఆపి ఉంచిన వాహనం రేషన్ బియ్యం అక్రమ రవాణా వాహనంగా గుర్తించినట్లు సీఐ బాబి తెలిపారు. వాహనం వద్ద ఎవరూ లేరని, పరారైనట్లు చెప్పారు. దీంతో వాహనంలోని 73 బస్తాల్లోని 3 టన్నుల రేషన్ బియ్యాన్ని రెవెనూ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. వాహన వివరాలను తెలుసుకుంటున్నామన్నారు.
నాయుడుపేట టౌన్: కారు ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి రింగ్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన విశ్వనాథుని లక్ష్మీనారాయణ, అతని భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు సుమంత్ కారులో తిరుమలకు బయలుదేరారు. మార్గం మధ్యలోని నాయుడుపేట పట్టణంలోని తమ బంధువైన సోల్లేటి ప్రవీణ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి సోల్లేటి ప్రవీణ, ఆమె కుమార్తె అనూషతో కలసి తిరుమలకు వెళ్లారు. వేంకటేశ్వరస్వామి దర్శనానంతరం తిరుగుప్రయాణమయ్యారు. మార్గం మధ్యలోని నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి రింగ్ రోడ్డు వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో పాడైపోయి ఆపి ఉన్న వాహనాన్ని కారు ఢీ కొంది. ఈ ఘటనలో నాయుడుపేట పట్టణానికి చెందిన సోల్లేటి ప్రవీణ (44) అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె కుమార్తె సోల్లేటి అనూష, వారికి సమీప బంధువులైన తూర్పుగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన విశ్వనాథుని లక్ష్మీనారాయణ, అతని భార్య రాజ్యలక్ష్మి, కారు నడుపుతున్న లక్ష్మీనారయణ కుమారుడు విశ్వనాథుని సుమంత్ తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ బాబి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ మృత దేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment