ఏఎంసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో ఆ పదవులపై పలువురు బోలెడు ఆశలు పెంచుకున్నారు. జిల్లాలోని 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించడానికి రిజర్వేషన్లు ఖరారు చేయడంతో అంతా వాటికి కోసం ఎదురుచూస్తున్నారు. 12 పదవులను మూడు పార్టీలకు పంపకాలు చేస్తే ఒక్కో పార్టీకి 4 చైర్మన్ పదవులు వస్తాయని చర్చసాగుతోంది. ఆ మేరకు ఆయా పార్టీలకు చెందిన ఆశావాహులు పదవుల కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు. అయితే బీసీ జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో వారికే అధిక స్థానాల కేటాయింపు ఉంటుందని అంతా భావించారు. అయితే కూటమి సర్కార్ బీసీలకు కేవలం మూడు స్థానాలనే ఖరారు చేయనున్నారు. ఓసీలకు మాత్రం 6 స్థానాలను కట్టబెట్టనున్నారు. మరోవైపు ఎస్సీలకు కేవలం రెండు స్థానాలు, ఎస్టీలకు ఒక్క స్థానంతోనే సరిపెట్టారని పలువురు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment