పకడ్బందీగా ప్రమోషన్లు
డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలన్నా... ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలన్నా సీనియారిటీ జాబితా తలనొప్పిగా మారింది. అయ్యోర్ల సీనియారిటీ జాబితా కచ్చితత్వంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చాలా వరకు ప్రక్షాళన చేపట్టింది. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు చేపట్టారు.
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల సీనియారిటీ జాబితాను పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఈ కసరత్తును ఈనెల 10వ తేదీలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 4,738 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ కేడర్ నుంచి హెచ్‌ఎం కేడర్ వరకు సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ప్రత్యేక బృందాలు నియామకం
సీనియారిటీ జాబితాను సిద్ధం చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ కసరత్తును ఉమ్మడి చిత్తూరు జిల్లా నోడల్ అధికారి కేడర్‌లో డీఈఓ వరలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. కసరత్తును పకడ్బందీగా పూర్తి చేసేందుకు చిత్తూరు, తిరుపతి డీఈఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న విద్యాశాఖ సిబ్బందిని నియమించారు. ఒక్కో బృందానికి ఇద్దరు సిబ్బంది చొప్పున 9 బృందాలను నియమించి కసరత్తు చేపడుతున్నారు. ఈనెల 10వ తేదీలోపు కసరత్తును పూర్తి చేసి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు జాబితాను పంపేలా కసరత్తు నిర్వహిస్తున్నారు.
కసరత్తు సాగుతోంది ఇలా..
జిల్లాలో 1989వ డీఎస్సీ నుంచి 2018వ సంవత్స రం డీఎస్సీ వరకు కేడర్‌ల వారీగా సీనియారిటీ జా బితాలను సిద్ధం చేస్తున్నారు. మొదటగా అన్ని మండలాల్లో ఎంఈఓలు జాబితాలను సిద్ధం చేసి డీఈఓ కార్యాలయానికి వివరాలు పంపుతున్నారు. ఆ వివరాలను డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు రికార్డుల ఆధారంగా మరో మారు పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 8295 ఎస్జీటీ కేడర్ పోస్టులు ఉండాల్సి ఉండగా 6,443 మంది, స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో 3263 పోస్టులు ఉండగా 3180 మంది విధులు నిర్వహిస్తున్నారు. హెచ్‌ఎం కేడర్‌లో 408 మంది టీచర్ల సీనియారిటీ జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాకు కసరత్తు
ప్రత్యేక బృందాలతో పరిశీలన
1989 డీఎస్సీ నుంచి 2018వ వరకు జాబితా
ఈనెల 10 లోపు పూర్తి చేసేలా చర్యలు
సీనియారిటీ జాబితా కసరత్తు వివరాలు
తిరుపతి జిల్లాలోని ప్రాథమిక,
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,232
సిద్ధం చేస్తున్న ఎస్జీటీ సీనియారిటీ
జాబితా 6,443
స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో 3,263
హెచ్‌ఎం కేడర్‌లో 408
జాబితా సిద్ధం చేస్తున్నాం
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల టీచర్ల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించిన నియమ, నిబంధనలను పాటిస్తూ కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ నెల 10వ తేదీలోపు కసరత్తును పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్జీటీ కేడర్‌లో 6443 మందికి గాను 3180 మంది జాబితాలు సిద్ధం చేయడం జరిగింది. మిగిలిన 3,263 మంది జాబితాలు, అదే విధంగా ఇతర కేడర్‌ల టీచర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
– వరలక్ష్మి, డీఈఓ, చిత్తూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment