వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్‌గా శాంతినాడార్
తిరుపతి కల్చరల్: వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్302(రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక,కేరళ) రాష్ట్రాల డిప్యూటీ గవర్నర్‌గా తిరుపతికి చెందిన శాంతి నాడార్ ఎన్నికై నట్లు వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు ప్రభావతి ఒక ప్రకటనలో తెలిపారు. డిస్ట్రిక్ట్ 302 పరిధిలోని వాకర్స్ సంఘాలను బలోపేతం చేసి, సమాజ హిత కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానని శాంతి నాడార్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే వాకర్స్ సంక్షేమం కోసం ఆరోగ్య అవగాహన సదస్సులు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావడానికి కారణమైన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు డాక్టర్ రవిరాజు ఆర్కాట్ కృష్ణప్రసాద్, మాధవనాయుడుకు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment