ధ్రువపత్రాల పరిశీలన
డీఈఓ రేణుకాదేవి
నేటి
నుంచి
అనంతగిరి: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నేటి నుంచి(ఒకటవ తేదీ) 5వ తేదీ వరకు ఉంటుందని డీఈఓ రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. షార్ట్‌లిస్టు చేసిన 1:3 జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు. ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్ ద్వారా వ్యక్తిగతంగా తెలియజేయడం జరిగిందన్నారు. 1:3 షార్ట్‌లిస్టు చేసిన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలన్నారు. సబ్జెక్టు వారీగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ల (స్టడీ, బదిలీ – మైగ్రేషన్, కులం, పీహెచ్‌సీ, స్పోర్ట్స్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల షీట్, ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల కోసం చెల్లుబాటు అయ్యే ఆర్‌సీఐ సర్టిఫికెట్, బదిలీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తు ఫారం కాపీ, హాల్ టికెట్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు)తో వెరిఫికేషన్ సెంటర్‌కు రావాలని సూచించారు. వెబ్‌సైట్‌లో లభ్యమయ్యే వెరిఫికేషన్ ఫారం కాపీ, అన్ని సర్టిఫికెట్లు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు.
వెరిఫికేషన్ సెంటర్లు
● వికారాబాద్‌లోని డైట్ కళాశాలలో ఎస్‌జీటీ (అన్ని మీడియంలు)హాజరుకావాలనిసూచించారు.
● వికారాబాద్ పట్టణం హైదరాబాద్ రోడ్డులోని శివారెడ్డిపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎస్‌ఏ, పీఈటీ, పండిట్‌లు హాజరుకావాలన్నారు.
● పై పేర్కొన్న తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాకపోతే తదుపరి నోటీసు లేకుండా రిక్రూట్‌మెంట్ హక్కులు కోల్పోతారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment