మంచాల: రైతుల సంక్షేమమే లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో తిరిగి చెల్లించాలని, అప్పుడే కొత్త వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. అర్హులందరికీ రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆరుట్ల, లోయపల్లి, నోముల గ్రామాల్లో రైతు సహకార సంఘాలకు చెందిన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. ఆక్రమణకు గురికాకుండా ప్రహరీలు నిర్మిస్తామని డీసీసీబీ చైర్మన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెదిరె హన్మంత్‌రెడ్డి, సీఈఓ శ్రీనివాస్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment