లింకు రోడ్డు.. ఏళ్లుగా పాట్లు
ఎన్కెపల్లిలో అవస్థలు పడుతున్న వాహనదారులు
బంట్వారం: కంకర తేలిన ఎన్కెపల్లి లింకు రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు, పాదచారులు నిత్యం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కోట్‌పల్లి మండల పరిధిలోని ఎన్కెపల్లి లింకు రోడ్డు అధ్వానంగా తయారైంది. జిన్నారం గేటు నుంచి ఎన్కెపల్లి మీదుగా బంట్వారం, తొర్మామిడి, కర్ణాటకలోని కుంచారం వెళ్లే వారికి చాలా సులువుగా ఉంటుంది. ప్రస్తుతం రోడ్డు బాగో లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు దూర ప్రాంతం నుంచి చుట్టూ తిరిగి తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఎన్కెపల్లి లింకు రోడ్డుకు మరమ్మతులు చేస్తే వాహనదారులకు సౌకర్యంగా ఉంటుంది. ఏళ్ల తరబడి సమస్య అలాగే ఉండడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ అదుపు తప్పి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. కంకర తేలిన రోడ్డుపై రాత్రివేళ అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎవరైనా ఆదమరిచి అటుగా వెళితే బొక్క బోర్లా పడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment