ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు
అనంతగిరి: కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని పలు వ్యవసాయ రైతు, కార్మిక సంఘాల జిల్లా ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా వ్యవసాయ, రైతు, కార్మిక సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వికారాబాద్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొంతమంది పెట్టుబడిదారుల కోసం యావద్దేశ సంపదనంతా ధారాదత్తం చేయడం సమంజసం కాదన్నారు. కేంద్రం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడం తగదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి గీత, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు మహేందర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పీర్‌మహ్మద్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఆశవర్కర్ల యూనియన్ జిల్లా నాయకురాలు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్‌లో వ్యవసాయ,
కార్మిక సంఘాల నిరసన ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment