రోడ్డుపై మురుగు.. పరిష్కారమెప్పుడో అడుగు
తాండూరు: తాండూరు పట్టణంలోని జాతీయ రహదారిపై కొన్ని రోజులుగా మురుగు నీరు ఏరులై పారుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని మహబూబ్‌నగర్–చించోళి రోడ్డుని రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా మార్చారు. అందుకు అనుగుణంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు పక్కన వరద, మురుగు నీరు పారేందుకు పెద్ద కాలువలను నిర్మించారు. అయితే 8 నెలలుగా సంబంధిత కాంట్రాక్టర్ వాటిని అసంపూర్తిగా వదిలేశారు. పట్టణంలోని శివాజి చౌక్ నుంచి బస్‌స్టేషన్ వరకు కాలువను నిర్మించారు. కానీ స్నేహ సూపర్ మార్కెట్ వద్ద ఉన్న రోడ్డు పక్కన మురుగు కాలువను అసంపూర్తిగా వదిలేశారు. రోడ్డు వెడల్పు పెరిగినా రహదారి వేయకపోవడం, మరోవైపు కాలువను అసంపూర్తిగా వదిలేయడంతో మురుగు నీరంతా రోడ్డుపై పారుతుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు రోడ్డుపై డ్రైనేజీ నీరు పారకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment