షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
మోమిన్‌పేట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన శుక్రవారం మధ్యా హ్నం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మోమిన్‌పేట కేంద్రానికి చెందిన మంగళి శ్రీనివాస్ ఇల్లు షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయింది. ఉదయం ఆయన భార్య గంగమ్మ ఇంట్లో పూజ చేసి కూతురు అఖిలతో పాటు బయట వచ్చి కూర్చుంది. అనంతరం ఇంట్లో నుంచి పొగ రావడంతో తలుపు తీసి చూడగా మంటలు ఎగబడ్డాయి. దీంతో ఆమె అరవగా చుట్టు పక్కల వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించ లేదు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని సాయంత్రం వరకు మంటలు ఆర్పారు. అప్పటికే ఇంట్లో నిత్యావసర సరుకులు, బట్టలు, రూ.2లక్షల నగదు, 2 తులాల బంగారం పూర్తిగా కాలిపోయిందని బాధితులు రోదించారు. రెవెన్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. కాంగ్రెస్ నాయకులు సుభాష్‌గౌడ్, రాజ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
కాలిపోయిన రూ.2 లక్షల నగదు, బంగారు ఆభరణాలు
Comments
Please login to add a commentAdd a comment