పేదల ప్రతినిధి కాకా
అదనపు కలెక్టర్ సుధీర్
అనంతగిరి: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని ఆదివారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సుధీర్, సాంఘిక సంక్షేమ అధికారి మల్లేశం, డీవైఎస్‌ఓ హనుమంతురావు తదితరులు కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా పేదల ప్రతినిధిగా పేరు గడించారన్నారు. దళిత, బహుజనుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు. వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి శుక్రవర్దన్ రెడ్డి, హాస్టల్ వార్డెన్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
షాద్‌నగర్ ఎమ్మెల్యేకు ముజాహిద్‌పూర్ నేతల వినతి
కుల్కచర్ల: బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముజాహిద్‌పూర్ కాంగ్రెస్ నాయకులు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కోరారు. ఆదివారం షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వారు చౌదర్‌గూడెం మండలం పెద్ద ఎల్కిచర్ల నుంచి మండల పరిధిలోని ముజాహిద్‌పూర్ వరకు బీటీ రోడ్డు లేక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా స్పదించి రోడ్డు లేని గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ బ్లాక్ అధ్యక్షుడు జగదీశ్వర్, కాంగ్రెస్ చౌదర్‌గూడెం మండల అధ్యక్షుడు రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వికారాబాద్ డీసీసీ కార్యదర్శి దేశ్‌ముఖ్ చంద్రభూపాల్, సీనియర్ నాయకులు శివకుమార్, రాములు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జీటీఏ జిల్లా కార్యవర్గ నియామకం
అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా బందెప్ప, వెంకట్రాములు
తాండూరు టౌన్: గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం రాష్ట్ర శాఖ బాధ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తాండూరుకు చెందిన ఎస్.బందెప్ప, ప్రధాన కార్యదర్శిగా వెంకట్రాములు, కోశాధికారిగా ఎం.సుధీర్‌ను నియమించారు. ఈసందర్భంగా నూతనంగా నియమితులైన అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. తమపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర శాఖ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆదర్శ పాఠశాలలో
ప్రవేశాలకు ఆహ్వానం
శంకర్‌పల్లి: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2025–2026 సంవత్సరానికి గాను 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు శంకర్‌పల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 6వ తేదీ నుంచి
http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 28 దరఖాస్తుకు చివరి తేదీ అని తెలి పారు. ఓసీలకు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్ల్యూఎస్ విద్యారులు రూ.125 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్ 13న రాత పరీక్ష ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment