షాద్‌నగర్: కమ్యూనిస్టు పార్టీ చరిత్ర గురించి నాయకులు, కార్యకర్తలు ప్రజలందరికీ వివరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య అన్నారు. పార్టీ ఏర్పడి వంద వసంతాలు అవుతున్న సందర్భంగా చేవెళ్ల, ఎల్బీనగర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాల్మాకుల జంగయ్య మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని అన్నారు. నిరుపేదలకు అండగా ఉంటూ ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తెచ్చి ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేసిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. పార్టీ వందేళ్ల ఉత్సవం సందర్భంగా చేవెళ్ల, ఎల్బీనగర్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లా, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు, ప్రదర్శనలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, జిల్లా సమితి సభ్యుడు చందుయాదవ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్‌చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జంగయ్య
Comments
Please login to add a commentAdd a comment