ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

Published Mon, Dec 23 2024 7:49 AM | Last Updated on Mon, Dec 23 2024 7:49 AM

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

అనంతగిరి: ప్రతీ ఒక్కరు ఉచిత వైద్యశిబిరాలను ఉపయోగించుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గిరేట్‌పల్లిలో గ్యాక్‌(గడ్డం ఎల్లమ్మ ఎల్లయ్య అనసూయ కృష్ణ) చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌, వికారాబాద్‌ ప్రాంతానికి చెందిన వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యుల పేరిట ఏర్పాటు చేసిన గ్యాక్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గ్యాక్‌ అనగా జర్మనీ భాషలో ఆపదలో ఆదుకోవడమని అర్థమని వివరించారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిత్యం వ్యాయామం, యోగా అవర్చుకోవాలన్నారు. శిబిరంలో తమ సేవలను అందించిన వైద్యులకు, ఇతర బృందానికి, సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరవణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌కుమార్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ కిషన్‌నాయక్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు కొండల్‌రెడ్డి, చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌, యండీ హఫీజ్‌, నరోత్తంరెడ్డి, ఎర్రవల్లి జాఫర్‌, ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్‌కు వినతి

కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలతో కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా నాయకులు లీలావతి, వెంకటమ్మ, భారతి, సుహాసిని, మంజుల, స్రవంతి, రజియా, పద్మ, సల్మా, సుజాత, స్వరూప తదితరులు ఉన్నారు.

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement