పథకాలపై అవగాహన కల్పించాలి
ఆర్డీఓ వాసుచంద్ర
కుల్కచర్ల: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అధికారులు ప్రజలకు వివరించాలని ఆర్డీఓ వాసుచంద్ర అన్నారు. సోమవారం మండలంలోని ముజాహిద్‌పూర్ గ్రామంలో కొనసాగుతున్న రేషన్‌కార్డు లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రస్తుతం వచ్చిన వారి వివరాలను పరిశీలించడంతో పాటుగా రానివారు ఇచ్చే దరఖాస్తులను సైతం స్వీకరించాలని సూచించారు. గ్రామసభలో ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపిక కోసం చర్చించి అభిప్రాయాలను స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వరాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, తహసీల్దార్ మురళీధర్, ఆర్‌ఐ రవి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, స్థానిక నాయకులు చంద్రభూపాల్, భాస్కర్, షర్పోద్దిన్, తదితరులు పాల్గొన్నారు.
యాలాలలో..
యాలాల: రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల విచారణ మండలంలో కొనసాగతుంది. సోమవారం మండల పరిధిలోని రాజీవ్ కాలనీలో ఆర్‌ఐ సాయిచరణ్ తన సిబ్బందితో కలిసి రేషన్‌కార్డుల విచారణ చేపట్టారు. కొత్తగా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కుటుంబ సభ్యుల పేర్ల నమోదు వివరాలపై విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment