మంగళవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2025
8లోu
నేటి నుంచి 24 వరకు సభలు
లబ్ధిదారుల జాబితాతో గ్రామాలకు అధికారులు
14 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు
22వేల మందికి ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు
5.90లక్షల ఎకరాలకు రైతు భరోసా
గణతంత్ర దినోత్సవం నుంచి నాలుగు కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రజా ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో నేటి నుంచి నాలుగురోజుల పాటు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లోనే అధికారులు ఎంపిక చేసిన జాబితా ప్రదర్శించనున్నారు.
వికారాబాద్: ప్రభుత్వం ఈ నెల 26 నుంచి మరో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించనున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు నిర్వహించనున్న గ్రామ సభలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభల్లోనే గ్రామస్తుల సమక్షంలో లబ్ధిదారుల జాబితాకు ఆమోదం తెలపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఇదే విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపికకు గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి దరఖాస్తుల విచారణ పూర్తి చేశారు.
ఆత్మీయ భరోసాకు 20 రోజుల నిబంధన
వ్యవసాయ భూమి లేని రైతు కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 22 వేల మందిని ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికకు గతేడాది కనీసం 20 రోజులు ఉపాధి హామీ పకథం పనులకు హాజరవ్వాలనే నిబంధన పెట్టండంతో పలువురికి ఇది అడ్డంకిగా మారుతోంది. జిల్లాలో వేల సంఖ్యలో కూలీలు ఉపాధి పనులకోసం దరఖాస్తులు చేసుకుని ఉండగా వారికి జాబ్‌కార్డులు రాలేదు. జిల్లాలో 1,83,309 జాబ్‌కార్డులుండగా ఇందులో 3,77,087 మంది కూలీలు ఉన్నారు. వేసవిలో సగటున 51 వేల నుంచి లక్ష పై చిలుకు కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు.
రూ.354 కోట్ల రైతు భరోసా
జిల్లాలో మొత్తం 6.17 లక్షల భూమి ఉండగా 2,68,107 మంది రైతులు ఉన్నారు. గత ప్రభుత్వ
హయాంలో ఈ మొత్తం భూమికి రైతు బంధు డబ్బులు ఎకరాకు రూ.పది వేల చొప్పున రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఒక్కో పంటకు జిల్లాలో రూ.308 కోట్ల నుంచి రూ.320 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో వేశారు. ప్రస్తుత ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం జిల్లాలో 5.90లక్షల ఎకరాలకు రూ.354 కోట్లు చెల్లించనున్నారు.
కొత్త రేషన్ కార్డులకు జాబితా సిద్ధం
జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 588 చౌకధరల దుకాణాలు ఉండగా ఇప్పటి వరకు 2,41,622 ఆహార భద్రతా కార్డులు జారీ చేశారు. ఇందులో 2,08,162 ఎఫ్‌ఎస్‌సీ కార్డులు, 26,730 అంత్యోదయ కార్డులు, 39 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెల 4673 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు 22 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఉన్న కార్డులలో 59వేలు పేర్లు చేర్చాలని 33 వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం 59 వేల పేర్లు ఇప్పటికే ఉన్న కార్డులలో చేర్చడంతో పాటు 22 వేల దరఖాస్తు దారులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అధికారులు జాబితా సిద్దం చేశారు.
న్యూస్‌రీల్
14 వేల ఇళ్లకు 2.57లక్షల దరఖాస్తులు
సొంతిళ్లు లేని నిరుపేదలకు నియోజకవర్గానికి 3 వేల నుంచి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కలిసి 14వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకాల దరఖాస్తుల కంటే ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.57లక్షల దరఖాస్తులు అందగా స్థలం ఉండి దారిద్య్రరేఖకు దిగువగా ఉన్న పేదలకు మొదటి విడతలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాగా లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ముఖ్య నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment