![సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04kgdgl05-360013_mr-1738718093-0.jpg.webp?itok=Yo7_fMjY)
సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం
పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్‌లోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. దేవేరుల సమేత మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం చిన్న శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, సర్వభూపాల వాహనం, కల్ప వృక్ష వాహనం, చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. అర్చకులు శ్రీవారి మూలవిరాట్టుకు అభిషేకం, ముత్యాల పందిరి, తిరుమంజనం తదితర పూజలు జరిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఇక్కడి ఆలయంలో రథసప్తమి వేడుకలను వైఖానస ఆగమ శాస్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని పూజల్లో పాల్గొన్నారు. – కొడంగల్
Comments
Please login to add a commentAdd a comment