![భూ ప్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04vkb94-360018_mr-1738718092-0.jpg.webp?itok=-mQ54NCR)
భూ ప్రకంపనాలపై భయాందోళన వద్దు
కొడంగల్ రూరల్: భూ ప్రకంపనాలపై ఎలాంటి ఆందోళనకు గురికారాదని జియాలజిస్టు, ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ డి.శశిధర్, టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ జి.సురేష్, రీసెర్చ్ పర్సన్ డాక్టర్ నరేష్, ఏడీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని టేకుల్‌కోడ్ గ్రామ రైతు వేదికలో స్థానికులతోపాటు అంగడిరాయిచూర్, ధర్మాపూర్ తదితర గ్రామాల ప్రజలకు భూకంపాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయకుమార్ మాట్లాడుతూ.. ఇటీవల మండలంలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనాలు వచ్చాయని.. ఈ విషయాన్ని ప్రజలు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండప్ప, సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ, న్యాయ వాది బస్వరాజ్, వన్నె.బస్వరాజ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్‌పై
అవగాహన ర్యాలీ
అనంతగిరి: ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకొని మంగళవారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరవణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. వ్యాధి లక్షణాలు, పరీక్షలు, చికిత్స విధానం గురించి ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలకు, గర్భిణులు, బాలింతలకు ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్, అధికారులు, సిబ్బంది నిరోషా, ప్రవీణ్, నిఖిల్, శ్రీనివాస్, రేణుకుమార్, జయరాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని సబ్ యూనిట్ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మలేరియా పీఓ డాక్టర్ రవీంద్రయాదవ్, ఏఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
![భూ ప్రకంపనాలపై భయాందోళన వద్దు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04kgdgl102-360014_mr-1738718093-1.jpg)
భూ ప్రకంపనాలపై భయాందోళన వద్దు
Comments
Please login to add a commentAdd a comment