నవ వధువు ఆత్మహత్య
అనంతగిరి: పెళ్లై మూడు నెలలు కాకముందే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ పట్టణంలోని సాకేత్ నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాకేత్ నగర్‌కు చెందిన సాయికి గత ఏడాది నవంబర్ 17న సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందిన శ్రీజ(20)తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.2 లక్షల నగదు, 12 తులాల బంగారం, బైక్ ఇచ్చారు. పెళ్లి అయిన కొన్ని రోజుల వరకు సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత సాయి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలు పెట్టాడు. మరో రూ.3లక్షలు తేవాలని ఒత్తి డి చేశాడు. పెళ్లికి చాలా ఖర్చు చేశారని, ఇప్పుడు డబ్బు ఇచ్చే పరిస్థితి మా కుటుంబానికి లేదని శ్రీజ భర్త సాయికి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. కానీ వినలేదు. డబ్బు కావాలని పట్టుబట్టాడు. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● అదనపు కట్నం వేధింపులు భరించలేక బలవన్మరణం
Comments
Please login to add a commentAdd a comment