![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/27/26vsc93-320092_mr_0.jpg.webp?itok=i9q-uR7h)
మహారాణిపేట: రైతులకు వైఎస్సార్ పశు బీమా పథకం వరమని కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో తన చాంబర్‌లో వైఎస్సార్ పశుబీమా పథకం పోస్టర్, కరపత్రాలను సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ఆపత్కాలంలో పశు బీమా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పాడి పశువులు, జీవాలు ఆకస్మికంగా చనిపోయినప్పుడు రైతులు నష్టపోతారని, కేవలం 20 శాతం బీమా సొమ్ము చెల్లిస్తే ఆపత్కాలంలో ఆసరా అవుతుందని పేర్కొన్నారు. జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.రామకృష్ణ మాట్లాడుతూ కేవలం రూ.384 చెల్లిస్తే రూ.30 వేలు..మూడేళ్ల కాలానికి బీమా వర్తిస్తుందన్నారు. ఈ సదుపాయం గొర్రలు, మేకలు, పందులు పెంపకం దారులకు ఉపయోగపడుతుందన్నారు. దీనికి సంబంధించి సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1962కు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డా.కరుణాకరరావు, సహాయ సంచాలకులు డా.శ్రీనివాస్, డా.శ్రీనుబాబు, డా.మాదిన ప్రసాదరావు, డా.పూర్ణిమ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment