ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం భీమిలి డివిజన్ రెవెన్యూ కాన్ఫరెన్స్‌లో జేసీ కె.మయూర్ అశోక్‌తో కలిసి వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజ ల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులపై రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తిగా అవగాహన పెంచుకుని విధులు నిర్వర్తించాలన్నారు. అన్యాక్రాంతానికి గురైన భూములను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. లోపభూయిష్టమైన రికార్డుల నిర్వహణ లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఆక్రమణలు చోటు చేసుకున్నట్టు తెలిస్తే అక్కడి రెవెన్యూ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో భాగంగా రెవెన్యూకు చెందిన వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ప్రత్యేక ఉప కలెక్టర్లు, భీమిలి నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment