‘సకాలంలో పన్ను చెల్లింపులు కీలకం’
బీచ్‌రోడ్డు: ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగడానికి సకాలంలో పన్ను చెల్లింపులు చాలా కీలకమని జిల్లా కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రతి అన్నారు. నగరంలోని ఒక హోటల్‌లో గురువారం సీఐఐ ఆధ్వర్యంలో జీ ఎస్టీ, కేంద్ర బడ్జెట్‌పై విశ్లేషణ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సంజయ్ దేశ ఆర్థిక పరిస్థితి, జీఎస్టీ పరివర్తన, వడ్డీ, జరిమానాలు, మినహా యింపులు, ఉపశమనం అందించే పథకాల గురించి వివరించారు. విశాఖ జోన్ పరిధిలో 99 శాతం మంది పన్నుల చెల్లింపునకు అంగీకారం తెలిపినప్పటికీ.. గడువు తేదీ లోగా 80–85 శాతం మంది మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. జీఎస్టీ రిటర్న్స్‌ను సకాలంలో దాఖలు చేయడానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సెంట్రల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆంథోనీ కాపర్ మాట్లాడుతూ జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 16(5) కింద జారీ చేసిన నోటీసుల కోసం క్షమాభిక్ష పథకాన్ని ఉపయోగించుకోవాలని పన్ను చెల్లింపుదారులకు తెలియజే శారు. సీఐఐ విశాఖ చైర్మన్ రాజేష్ గ్రంధి, కన్వీనర్ అనిల్ బెజవాడ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment