![విశాఖకు తీవ్ర అన్యాయం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06akp38-320004_mr-1738869443-0.jpg.webp?itok=w2BnV20c)
విశాఖకు తీవ్ర అన్యాయం
వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు
అనకాపల్లి: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ రావాలన్నది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమని, ఇప్పుడు ఆ కల పూర్తి స్థాయిలో సాకారం కావడం లేదని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్టల్ రైల్వేజోన్ పరిధి నిరాశాజనకంగా ఉందన్నారు. ఇది తల లేని మొండెంలా ఉందని, ఇంతకాలం వాల్తేరు డివిజన్‌లో ఉన్న కేకే లైన్‌ను రాయగడ డివిజన్‌లో చేర్చడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. కేకే లైన్ విశాఖ డివిజన్ పరిధిలోనే ఉండాలన్నది ఉత్తరాంధ్రవాసుల చిరకాల వాంఛన్నారు. వాల్తేరు డివిజన్‌ను విచ్ఛిన్నం చేసి ఒడిశాకు పెద్దపీట వేశారని ఆయన విమర్శించారు. సౌత్ కోస్ట్ రైల్వేజోన్‌కు అన్యాయం జరుగుతున్నా చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. అనకాపల్లి, విశాఖ ఎంపీలు సీఎం రమేష్, భరత్ ఎందుకు నోరు మేదపడం లేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment