![కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు వినతి పత్రం అందజేస్తున్న అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/arukump_mr-1738869444-0.jpg.webp?itok=STJv7W_I)
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు వినతి పత్రం అందజేస్తున్న అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి
సాక్షి, పాడేరు : కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్ భవన్‌లో కేంద్ర మంత్రిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు.
విశాఖ పర్యాటక భూభాగంలో అరకులోయ ఉందని.. కేకే లైన్‌ను విశాఖ రైల్వే డివిజన్‌లో ఉంచడం వల్ల అరకులోయ, కిరండూల్ రైల్వే లైన్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. తల్లిలాంటి వాల్తేరు డివిజన్ నుంచి కేకే లైన్‌ను వేరే చేయడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని వాపోయారు. రాయగడ డివిజన్‌లో కేకే లైన్‌ను విలీనం చేసే చర్యలను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రికి ఎంపీ విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment