![దివ్యాంగ పిల్లలను గుర్తించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06vsc200-320062_mr-1738869442-0.jpg.webp?itok=W4nhfqiQ)
దివ్యాంగ పిల్లలను గుర్తించాలి
విశాఖ లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి దివ్యాంగులను గుర్తించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వెంకట శేషమ్మ అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవా సదన్‌లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, అంగన్‌వాడీ కార్యకర్తలకు ‘ఇంటింటికి వెళ్లి దివ్యాంగుల గుర్తింపు’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శేషమ్మ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. దివ్యాంగ పిల్లలను ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే వాళ్లు మాములు మనుషులుగా మారే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, అనకాపల్లి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ పి.రవికుమార్, సీ్త్రశిశు సంక్షేమ శాఖ జిల్లా పీడీ జి.జయదేవి, అనకాపల్లి పీడీ అనంత లక్ష్మి, వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె.మాధవి, కేజీహెచ్ చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ చక్రవర్తి, ప్రభుత్వ మానసిక వైద్య ఆస్పత్రి డాక్టర్ ప్రసన్నకుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment