మైనర్‌పై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు | - | Sakshi
Sakshi News home page

మైనర్‌పై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు

Published Wed, Jan 3 2024 4:22 AM | Last Updated on Wed, Jan 3 2024 7:35 AM

- - Sakshi

విశాఖ సిటీ: బాలికపై లైంగిక దాడి కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అడుగడుగునా మభ్యపెట్టి.. వంచించిన ఈ ఘటనలో 11 మంది నిందితులను మంగళవారం అరెస్ట్‌ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఇందులో మరికొంత మంది పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

పుట్టిన రోజు నాడే..
ఒడిశాకు చెందిన కుటుంబం పొట్టకూటి కోసం విశాఖకు వచ్చి కంచరపాలెం ప్రాంతంలో నివాసముంటోంది. 16 ఏళ్ల మైనర్‌ను నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో పనికి పెట్టారు. ఆమెకు అక్కడే ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. డిసెంబర్‌ 17న ఆమె పుట్టిన రోజు కావడంతో ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఇమ్రాన్‌తో కలిసి బీచ్‌లో బర్త్‌డే చేసుకోవడానికి వెళ్లింది. అక్కడ వేడుకలు చేసుకున్న తర్వాత మాయమాటలు చెప్పి రాత్రి 10 గంటలకు ఇమ్రాన్‌తో పాటు అతని స్నేహితుడు సోహెబ్‌ ఒక లాడ్జికి తీసుకెళ్లి ఇద్దరూ ఆమైపె అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత రోజు వారి స్నేహితుడు లాడ్జికి వచ్చి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు 18వ తేదీ ఉదయం 5 గంటలకు ముగ్గురూ లాడ్జి నుంచి బయటకు వచ్చారు. ఆమెను 5.30 గంటలకు తన ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. బాలిక మనస్తాపంతో ఇంటికి వెళ్లకుండా ఆర్కే బీచ్‌కు వద్ద ఉన్న గోకుల్‌ పార్కుకు చేరుకుంది.

ఫొటోలు పేరుతో ట్రాప్‌ చేసి..
ఉదయం 9 గంటల సమయంలో బీచ్‌ ఉన్న మైనర్‌ను బీచ్‌ ఫొటోగ్రాఫర్లు సయ్యద్‌ మీరా షరీఫ్‌ అలియాస్‌ చెర్రీ, హరీష్‌ , నాగేంద్ర, గోపీలు గమనించారు. ఆమెకు ఫొటోలు తీసి మాటలతో ట్రాప్‌ చేశారు. ఉదయం 10.30 గంటలకు నాగేంద్ర, చెర్రీలు బాలికను ద్విచక్ర వాహనంపై ఒక లాడ్జికి తీసుకువెళ్లారు. లాడ్జి వద్ద అప్పటికే గోపీ, హరీష్‌లు సిద్ధంగా ఉన్నారు. లాడ్జిలో నలుగురు ఆ రోజంతా లైంగిక దాడికి పాల్పడ్డారు. 19వ తేదీ రాత్రి వారి స్నేహితులు శ్రీను, అశోక్‌, నరేష్‌ లాడ్జికి వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిపై పైశాచికంగా ప్రవర్తించారు. 20న మరో ఇద్దరు తాంబే, ఈశ్వర్‌ కూడా వచ్చి ఆమైపె అఘాయిత్యానికి పాల్పడ్డారు. 21వ తేదీన బాలికను మరో లాడ్జికి తీసుకువెళ్లి నాగేంద్ర, హరీష్‌తో పాటు మరో ఇద్దరు ప్రవీణ్‌, శివ కూడా ఆమైపె పశుత్వాన్ని ప్రదర్శించారు. 22న ఆమె పరిస్థితి దారుణంగా మారి కడుపు నొప్పితో బాధపడుతూ తనను ఏమీ చేయవద్దని, తన ఊరికి తీసుకువెళ్లాలని ప్రాధేయపడింది. దీంతో అదే రోజు చెర్రీ ఆమెను ఒడిశాలోని బరంపురానికి బస్సులో తీసుకువెళ్లి పునుకొల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద విడిచిపెట్టి ఆమె చేతిలో రూ.200 పెట్టి వచ్చేశాడు.

ఒడిశా పోలీసులు గమనించి..
అనారోగ్యంతో ఉన్న మైనర్‌ను గమనించిన అక్కడి పోలీసులు హోమ్‌కు తరలించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ డిసెంబర్‌ 17న నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఒడిశా పోలీసుల నుంచి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులతో పాటు పోలీసులు కూడా అక్కడికి వెళ్లి బాధితురాలిని విశాఖకు తీసుకువచ్చారు. జరిగిన విషయంపై ఆమెను ప్రశ్నించినప్పటికీ మానసికంగా కుంగిపోవడంతో అసలు విషయాన్ని చెప్పలేకపోయింది. దీంతో పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించి ఇంటికి పంపించారు. అయితే ఈ నెల 31న బాలిక జరిగిన అసలు విషయాన్ని తల్లిదండ్రులకు రోదిస్తూ వివరించింది.

దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వెంటనే అదృశ్యం కేసును పోక్సో కేసుగా మార్చారు. నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ ఆదేశాల మేరకు దిశ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. లాడ్జిలు, వెళ్లిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. దాని ప్రకారం 11 మంది నిందితులను గుర్తించి పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే బాలిక ప్రియుడు ఇమ్రాన్‌, అతని స్నేహితుడు సోహెబ్‌ పరారీలో ఉన్నారు. వారి కోసం రెండు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం వారి స్నేహితులు ఇద్దరిని స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. బాధితురాలిని కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించి అనంతరం మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement