ఉక్కుపై బాబు, పవన్ సమాధానం చెప్పాలి
గాజువాక : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని సీఐటీయూ ఆలిండియా ఉపాధ్యక్షురాలు ఎస్.పుణ్యవతి డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆ పరిశ్రమ కార్మికులు గాజువాకలో ఆదివారం ధర్నా నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులను కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సేవ్ పబ్లిక్ సెక్టార్.. సేవ్ ఇండియా అంటూ నినదించారు. వీఆర్‌ఎస్ పేరుతో కార్మికుల తొలగింపు ఆపాలని, పెండింగ్‌లో ఉన్న కార్మికుల జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పార్టీలకు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టడంలేదన్నారు. ఈ ధర్నాలో వాస్తవానికి చంద్రబాబు కూర్చోవాలన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ నుంచి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం కార్మికులు తమ కుటుంబాలతో నాలుగేళ్లుగా ఆందోళన చేస్తున్నా ఏ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను అదానీకో, మిట్టల్‌కో, మరెవరికో కట్టబెడతామంటున్నారని, ప్రైవేట్‌వాడు వచ్చి ఏం ఉద్దరిస్తాడని ప్రశ్నించారు. ఢిల్లీ తరహాలోనే విశాఖలో కూడా కాలుష్యం దారుణంగా పెరుగుతోందన్నారు. ఇక్కడ భూములు ఎక్కువగా ఉండటం వల్ల కాలుష్యాన్ని నియంత్రించగలుగుతున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. స్టీల్‌ప్లాంట్ సీఐటీయూ నాయకులు జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, వై.టి.దాస్, ఎన్.రామారావు, జి.శ్రీనావాసరావు, శ్రీనివాసరాజు, నమ్మి రమణ, కుమారమంగళం, ఆర్‌కేఎస్‌వీ కుమార్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
ఇంత జరుగుతున్నా
వారు ఎక్కడున్నారు?
సీఐటీయూ ఆలిండియా ఉపాధ్యక్షురాలు
పుణ్యవతి ఎద్దేవా
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
స్టీల్‌ప్లాంట్ కార్మికుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment