సంస్థ పురోభివృద్ధికి కృషి చేద్దాం..
పరవాడ: సంస్థ పురోభివృద్ధికి అంతా కలిసి పనిచేయాలని ఎన్టీపీసీ సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఆర్.పాండు పిలుపునిచ్చారు. సింహాద్రి ఎన్టీపీసీని ఆదివారం సందర్శించారు. ఆయనకు జీజీఎం సంజయ్‌కుమార్ సిన్హా పుష్పగుచ్ఛం అందించి, సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సింహాద్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థ పురోభివృద్ధిపై ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించారు. ఎన్టీపీసీలో జరుగుతున్న కార్యకలాపాలు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్శనలో భాగంగా సంస్థలో కంట్రోల్ రూమ్, సీహెచ్‌పీ డబ్ల్యూటీ ఏరియా, ఎఫ్‌జీడీ, జీవన్‌రేఖా ఆస్పత్రిలోని సృజనం చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించి, అక్కడి కార్యకలాపాలపై సంబంధిత అధికారులు, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు.
అంగరంగ వైభవంగా స్వర్ణోత్సవం
దీపాంజలినగర్‌లోని సాధన క్రీడా మైదానంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన ఎన్టీపీసీ స్వర్ణోత్సవంలో కె.ఆర్.పాండు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రాండ్ కల్చరల్ ఈవెంట్‌ను ఆసాంతం తిలకించారు. ఈవెంట్‌లో గాయకుడు శ్రీరామచంద్ర తన అద్భుత పాటల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రైజింగ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారతదేశ విద్యుత్ రంగంలో ఎన్టీపీసీ 50 ఏళ్ల ప్రయాణం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీని సందర్శించిన సౌత్ ఆర్‌ఈడీ పాండు
Comments
Please login to add a commentAdd a comment