జియో ట్యాగ్ సర్వేకు సహకరించండి
జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్
డాబాగార్డెన్స్: వార్డు కార్యదర్శులతో ఇంటింటా చేపట్టిన జియో ట్యాగ్ సర్వేకు నగర ప్రజలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్ కోరారు. జీవీఎంసీ కార్యాలయంలో జియో ట్యాగ్ సర్వేపై వార్డు కార్యదర్శులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటా నిర్వహిస్తున్న జియో ట్యాగ్ సర్వే ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే పూర్తయ్యిందన్నారు. వార్డు కార్యదర్శులు సర్వే నిర్వహిస్తున్న సమయంలో వివరాల ఇవ్వడంతో ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ వార్డు కార్యదర్శులు గుర్తింపు కార్డుతో ప్రతి ఇంటికి వెళ్లి.. అవగాహన కల్పించిన తర్వాత సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు ప్రజలకు సహకరించాలన్నారు. అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఆర్.సోమన్నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment