టౌన్‌ప్లానింగ్‌ సెక్రటరీ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

టౌన్‌ప్లానింగ్‌ సెక్రటరీ సస్పెన్షన్‌

Published Wed, Nov 27 2024 7:15 AM | Last Updated on Wed, Nov 27 2024 7:15 AM

-

మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు

డాబాగార్డెన్స్‌: విధుల్లో నిర్లక్ష్యం వహించిన జీవీఎంసీ జోన్‌–8 టౌన్‌ప్లానింగ్‌ విభాగం వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ సుబ్బలక్ష్మిని సస్పెండ్‌ చేస్తూ జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదే జోన్‌లో పర్యవేక్షణలో నిర్లక్ష్య వహించిన అప్పటి టీపీవో తేజేశ్వరరావుతోపాటు ఏసీపీ రఘునాథరావుకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. జోన్‌–8 పరిధి 97వ వార్డు సుజాతనగర్‌లో ఓ ఇంటి యజమాని తన నివాస భవనానికి స్టిల్ట్‌ ఫ్లోర్‌ పార్కింగ్‌కు ఉపయోగించుటకు, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఆపై రెండు అంతస్తులు నిర్మించేందుకు జీవీఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. కానీ ప్లాన్‌కు విరుద్ధంగా అదనంగా మూడు అంతస్తులు నిర్మించారు. దీనిపై సంబంధిత వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ తగిన వివరణ ఇవ్వకపోవడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను జీవీఎంసీ కమిషనర్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే జోన్‌లో గతంలో విధులు నిర్వహించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి డి.తేజేశ్వరరావు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ (ఇన్‌చార్జి) సీహెచ్‌.రఘునాథరావు విధుల పట్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, నిర్ణీత గడువులోగా తగిన వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement