రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ఎద్దేవా
డాబాగార్డెన్స్: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచి, రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆక్షేపించారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ నేతృత్వంలో మంగళవారం డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన అంబేడ్కర్ స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ రచించిన రెడ్‌బుక్‌తోనే రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. కావాలనే ఒక వర్గంపైనే కేసులు బనాయించి, బెదిరింపులు, దాడులు, హత్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్ని దాడులు, బెదిరింపులకు పాల్పడినా ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ నిలిచి పోరాడుతుందన్నారు. రైల్వే జోన్ స్థలం విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 2020 జనవరి మొదటి వారంలో రైల్వే జోన్‌కి సంబంధించి ముడసర్లోవలో స్థలం కేటాయించామని, రికార్డులు పరిశీలించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రూ.లక్షా 20 వేల కోట్ల పెట్టుబడులతో పెద్ద కంపెనీలు వస్తున్నాయంటే అది వైఎస్సార్ సీపీ చొరవేనన్నారు. నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, కరణం ధర్మశ్రీ, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాన్‌వెస్లీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, కార్పొరేటర్లు చెన్నా జానకీరామ్, బిపిన్‌కుమార్ జైన్, పార్టీ ముఖ్య నాయకులు కంట్రెడి రామన్నపాత్రుడు, ఐహెచ్ ఫరూఖీ, డాక్టర్ జహీర్ అహ్మద్, దొడ్డి బాపూ ఆనంద్, పల్లా అప్పలకొండ, మొల్లి అప్పారావు, తుల్లి చంద్రశేఖర్, పీతల వాసు, అలపున కనకారెడ్డి, నడింపల్లి కృష్ణంరాజు, పేడాడ రమణకుమారి, వంకాయల మారుతీప్రసాద్, ఆల్ఫా కృష్ణ, డాక్టర్ మూగి శ్రీనివాసరావు, పచ్చిరపల్లి రాము, పాక సత్యనారాయణ, మాసిపోగు రాజు, ముజీబ్‌ఖాన్, లండా రమణ, సనపల రవీంద్ర భరత్, ముత్తాబత్తుల రమేష్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment