మహారాణిపేట : పిల్లల బంగారు భవిష్యత్తు కోసం–బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో డిసెంబర్ 7న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్(పీటీఎం) సమావేశం విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులతో శనివారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 11 మండలాల పరిధిలోని ఉన్న 595 ప్రభుత్వ పాఠశాల్లో పీటీఎం సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల పాఠశాలలు, తల్లిదండ్రుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. పోషకాహారం, పిల్లల భద్రత అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు. డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్, ఉప విద్యాశాఖ అధికారి సోమేశ్వరరావు, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment